పెదనందిపాడులో నాట్స్ ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పెదనందిపాడులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు, బోర్డ్ డైరెక్టర్ బాపయ్య చౌదరి నూతి(బాపు) ఆర్థిక సహకారంతో పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. గ్లో ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రిలు సహకరించాయి. 550 మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. 275 మందికి కంటి శుక్లాల శస్త్రచికిత్స అవసరమని గురించినట్లు, వారికి రవాణా, ఆపరేషన్, కళ్లజోళ్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామని బాపు తెలిపారు. స్థానికులు కాకుమాను నాగేశ్వరరావు, దాసరి సుబ్బారావు, దాసరి రమేశ్ సమన్వయపరిచారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉచిత కంటి, వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నందుకు బాపుకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ మరియా, డాక్టర్ అపర్ణ, క్యాంపు ఎగ్జిక్యూటివ్ రాంబాబు, నూతి సుబ్బారావు, సీతాదేవి, మాజీ ఎంపీపీ నర్రా బాలకృష్ణ, ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి శేషగిరిరావు, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు, విశ్రాంత ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వేణు గోపాల్, రావి శివరామకృష్ణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్య, 25 మంది ఎన్.సి.సి. విద్యార్థులు, ఎన్.సి.సి. కెప్టెన్ డా.పాతూరి శ్రీనివాస్, గోవిందరాజు, మక్కెన జవహర్ రాణి, నూతి శ్రీను, దొప్పలపూడి రమేష్, కాపు వెంకట సుబ్బారావు, నూతి పూర్ణయ్య, కరీముల్లా, పోతురాజు, ఆలూరి సుజిత్, సరిమెళ్ళ చౌదరి, అంకారావు తదితరులు పాల్గొన్నారు. శిబిర నిర్వహణకు తోడ్పడిన నాట్స్ బోర్డ్ డైరెక్టెర్ రాజేంద్ర మాదలకి, నూతి బాపులకు నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు ధన్యవాదాలు తెలిపారు.

Tags-NATS Nuthi Bapu GLOW Foundation Sankara Eye Foundation Free Eye Camp In Pedanandipadu

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles