పేద విద్యార్థులకు అండగా నాట్స్. గుంటురు జిల్లా పర్యటనలో అధ్యక్షుడు శ్రీహరి.

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అధ్యక్షుడు శ్రీహరి మందాడి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తాను చదువుతున్న గుంటూరు జిల్లా రెంటపాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ప్రతిభ గల పేద విద్యార్ధులకు నాట్స్ సంస్థ తరఫున అండగా నిలబడతామని హామీనిచ్చారు. ఆయన పర్యటనలో భాగంగా విద్యార్థులు ఘనస్వాగతం పలికారు.

చదువు ఒక్కటే జీవితాలను మారుస్తుందని, విద్య వైపు దృష్టి పెడితే అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని విద్యార్ధులకు సూచించారు. ఈ పాఠశాలలో విద్యార్ధుల మధ్యాహ్నా భోజనానికి అవసరమైన ప్లేట్లు, గ్లాసులు అందిస్తానని శ్రీహరి తెలిపారు. ప్రతిభ గల విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇస్తామని ప్రకటించారు. శ్రీహరి ఈ పాఠశాలలో విద్యార్ధులకు గతంలో ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించారు. పాఠశాల అభివృద్ధికి సాయం చేస్తున్న శ్రీహరిని ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు సన్మానించారు. శ్రీహరి చొరవను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.

Tags-NATS To Help Poor Students In Telugu States Says Srihari Mandadi

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles