ఆస్ట్రేలియాలో బోనాల జాతర

Featured Image

ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గత పన్నెండు సంవత్సరాలుగా మెల్‌బోర్న్‌ నగరంలో రాక్బ్యాంక్ దుర్గ మాత టెంపుల్‌లో మెల్‌బోర్న్‌ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు. తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు. పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో దుర్గా మాత ఆలయంలో ఎంతో సందడి చేసారు.

బోనాల పాటలకు చేసిన నృత్యాలకు భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్న ఈ వేడుకలను అదే స్థాయిలో గత 12 సంవత్సరాలు గ నిర్వహిస్తున్న మెల్బోర్న్ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, దీపక్ గద్దె, ప్రజీత్ రెడ్డి కోతిలను ఈ వేడుకలకు హాజరైన వివిధ సంఘాల నాయకులు అభినందించారు.

Tags-Australia Bonalu 2025

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles