వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ

Featured Image

ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని అమెరికాలోని వర్జీనియాలో తానా ఆధ్వర్యంలో సాంస్కృతిక విభాగం కోఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు ఆధ్వర్యంలో "ఆడపడుచుల గోరింటాకు పండుగ" కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థానిక తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మహిళలు మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తారని సాయిసుధా అన్నారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ 50వ వసంతంలోకి త్వరలో అడుగుపెడుతున్న తానా ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.... అమ్మ భాషకు, తెలుగుజాతికి తానా గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిందని కొనియాడారు. కార్యక్రమంలో పాత్రికేయులు డీఎన్ ప్రసాద్, సుధీర్ కొమ్మి, జానీ నిమ్మలపూడి, రాజేష్ కాసరనేని, అనిత మన్నవ, శ్రీవిద్య సోమ, అనీల్ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శాంతి పారుపల్లి,కవిత చల్లా,త్రిలోక్ కంతేటి, సాయి బొల్లినేని, సత్య సూరపునేని, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags-TANA Virginia Aashada Masam Celebrations

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles