న్యూయార్క్‌లో చినజీయర్ ఆశీస్సులు అందుకున్న పాతూరి

Featured Image

గుంటూరు జడ్పీ మాజీ ఛైర్మన్, ఏపీ భాజపా మీడియా విభాగ ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం న్యూయార్క్ విమానాశ్రయంలో చినజీయర్ స్వామిజీ ఆశీస్సులు అందుకున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని చినజీయర్ ఢిల్లీ మీదుగా బద్రీనాథ్ వెళ్తున్నారు. వచ్చే నెల తిరిగి ఆయన అమెరికా రానున్నారు.

సనాతన ధర్మం, హైందవ సంస్కృతి తదితర అంశాలపై పాతూరి చినజీయర్‌తో చర్చించారు. తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల విశేషాలను స్వామిజీకి పాతూరి వివరించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు.

Tags-Paturi Nagabhushanam Meets Chinajeeyar in New York

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles