
వైభవంగా సాయి సమాజ్ ఆఫ్ సాగినా తొలి వార్షికోత్సవం

సాయి సమాజ్ ఆఫ్ సాగినా మొదటి వార్షికొట్సవ వేడుకలు శుక్ర, శని, ఆదివారాల్లో మూడురోజుల పాటు వైభవంగా నిర్వహించారు. మిషిగన్ రాష్ట్రంతో పాటు కెనడా నుంచి వచ్చిన వందలాది భక్తులు ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మురళి శర్మ భువనగిరి, ట్రై సిటీ హిందూ టెంపుల్ ప్రధాన పురోహితుడు యుగంధర్ శర్మ భాగవతుల, మిస్సూరీకి చెందిన శివ శంకర్ ఫణికుమార్ శర్మ, సాయి సమాజ్ ప్రధాన పురోహితుడు చిలకమర్రి వెంకటరామానుజ చార్యులు సమన్వయపరిచారు.
శుక్రవారం మహాగణపతి పూజ మరియు అంకురార్పణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం సర్వ దేవతా మంటపారాధన, సర్వ దేవతా హోమం, మహాలక్ష్మీ హోమం, మహాలక్ష్మీ కుంకుమార్చన పూజలు జరిగాయి. ఆదివారం ముగింపు రోజున సర్వ దేవతా హోమం, మహాపూర్ణాహుతి, సద్గురు సాయిబాబాకి 108 కళశాభిషేకం, వెంకటేశ్వర కళ్యాణం నిర్వహించారు. ఆదివారం నాడు స్థాపక అధ్యక్షుడు మురళి గింజుపల్లి, డైరెక్టర్ శ్రీనివాస వేమూరిలు ప్రసంగిస్తూ ఈ వార్షికోత్సవానికి సహకరించిన భక్తులు-వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో అతిపెద్ద సాయిబాబా మందిరాల్లో ఒకటిగా ఈ ఆలయం ఎదుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవ సమయంలో మందిరంలో దుర్గామాత విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.
తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, సాయి సమాజం కార్యనిర్వాహక కమిటీని ప్రకటించింది. శుభా శ్రీనివాస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, స్నేహా సుంకర కో-చైర్మన్‌గా ఎంపికయ్యారు. నిర్మాణ కమిటీలో బాబు త్యాగరాజన్, ప్రణీత్ కోనేరు, సాంబశివరావు కొర్రపాటి ఉన్నారు. ఐటి మరియు కమ్యూనికేషన్ బాధ్యతలు కార్తికేయన్ బాలకృష్ణన్, మురళీ తమ్మినానా నిర్వహించనున్నారు. పబ్లిక్ రిలేషన్ బాధ్యతలు రాజేష్ ఓజా, అలంకరణ-అన్నప్రసాదం బాధ్యతలను రోహిణి వైద్య, మోనికా భుటి, విశాఖా పాట్కీ నిర్వహించనున్నారు. యువత మరియు సాంస్కృతిక విభాగాల నేతృత్వం స్వాతి త్యాగరాజన్, నిర్మల్ లోగనాథన్ వహించనున్నారు.
---
The Sai Samaj of Saginaw celebrated its first anniversary with a vibrant three-day spiritual festival held from July 18 to July 20. The event attracted hundreds of devotees from across Michigan and Canada. The celebrations featured a series of traditional rituals, including Mahaganapati Puja and Ankurarpana on the opening day. The second day was dedicated to sacred offerings such as Sarva Devatha Mantaparadhana, Sarva Devatha Homam, Mahalaxmi Homam, and Mahalaxmi Kumkumarchana. The grand finale on Sunday included a powerful Maha Purnahuti and the revered 108 Kalasa Abhishekam to Sri Sadguru Saibaba, along with a divine Sri Venkateshwara Kalyanam.
The spiritual event was guided by prominent religious leaders, including Dr. Murali Sharma Bhuvanagiri, Brahma Sri Yugandhar Sarma Bhagavatula, Shiva Shankar Phani Kumar Sharma, and Sri Chilakamarri Venkat Ramanuja Charyulu. Their collaborative leadership infused the festival with profound spiritual energy, creating a deeply reverent atmosphere. Devotees expressed their joy and spiritual fulfillment throughout the event, with many highlighting the sense of unity and devotion experienced over the three days.
To mark the milestone, the Sai Samaj of Saginaw announced the formation of its inaugural Executive Committee. The committee includes individuals dedicated to the temple’s growth and service, with Shubha Srinivas appointed as Executive Chair and Sneha Sunkara as Co-Chair. The temple also plans to install a Durga Mata statue during the upcoming Navaratri festival and expand its collection of idols with Sri Venkateshwara Swamy and Lord Krishna. This marks a significant step in the temple's mission to honor the broader Hindu pantheon and strengthen its community ties.
Tags-Saginaw Sai Samaj First Anniversary
Gallery




Latest Articles
- Kalaratna Kv Satyanarayana Felicitated By Ata Dallas
- Tana Virginia Aashada Masam Celebrations
- Nats Nuthi Bapu Glow Foundation Sankara Eye Foundation Free Eye Camp In Pedanandipadu
- Ttd Apnrt Announces 100 Vip Break Darshans For Nri Nrts
- Dr Haranath Policherla Felicitated By Michigan Indian Americans In Detroit
- Ata Helps Dilraju Launch Dil Raju Dreams Drd Platform In Usa
- Tagdv Telugu Delaware Picnic 2025
- Nats Telugu Dallas Imparting Social Awareness In Next Gen Kids
- Gouru Venkatreddy Tours Philadelphia
- Mgmnt Conducts Advaitam Dance Of Yoga Kuchipudi Dance Show
- Tcss Singapore Bonalu Jatara 2025
- Abhijat Seth Appointed As Nmc Chairman. Dr.Edara Lokesh Applauds His Appointment.
- Smashers Group Singapore Badminton Tournament For Nrts 2025
- Raghuramaraju Raghavendrarao Launches Arachakampai Akshara Samaram Book In Washington Dc
- Ap Assembly Deputy Speaker Raghurama Meets Virginia Congressman Suhas
- Nats 2025 Youth Scholarships
- Kommana Sateesh As Tana Foundation Trustee
- Tauk London Bonalu Jatara 2025
- Svbtcc London Srinivasa Kalyanam 2025 On Toli Ekadashi
- Retd Dgp Abv In Dallas