తితిదేలో ఎన్నారైలకు రోజుకి 100 VIP Break దర్శనాలు

Featured Image

ప్రవాసాంధ్రులకు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించనుంది. ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీ) అధ్యక్షుడు రవి వేమూరి ఆధ్వర్యంలో ఆ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో సీఎంను కలిశారు. వైకాపా హయాంలో తిరుమలలో ప్రవాసాంధ్రులకు అందించే వీఐపీ బ్రేక్‌ దర్శన కోటాను 50 నుంచి 10 తగ్గించారని.. దీనివల్ల విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం ఆ కోటాను 10 నుంచి 100కు పెంచారు. రోజూ వంద వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు ఇవ్వాలని తితిదేకు సూచించారు.

ప్రవాసాంధ్రులు ముందుగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ వెబ్‌సైట్‌ https://apnrts.ap.gov.in/ లోకి వెళ్లి సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం. ఇందుకోసం తాము ఉంటున్న దేశాల వీసాలు, వర్క్‌ పర్మిట్‌ల వివరాలు నమోదు చేయాలి. వెబ్‌సైట్‌లో శ్రీవారి దర్శనానికి సంబంధించి మూడు నెలల స్లాట్లు కన్పిస్తాయి. అందులో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆ రోజు పరిస్థితులను బట్టి తితిదే టికెట్లను కేటాయిస్తుంది. టికెట్లు కేటాయింపు అయిన వారికి తిరుమలలోని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌కు చెందిన పీఆర్వో ద్వారా వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. వివరాలకు ప్రవాసాంధ్రులు సంస్థ వెబ్‌సైట్‌ ద్వారాగానీ, ఏపీలోని తాడేపల్లి, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ జంక్షన్‌ ఫోన్‌ నంబరు 0863 2340678లో గానీ సంప్రదించవచ్చని సంస్థ ప్రతినిది వెంకట్‌రెడ్డి తెలిపారు.

Tags-TTD APNRT Announces 100 VIP Break Darshans For NRI NRTs

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles