బే-ఏరియాలో హృదయ నాదం సంగీత విభావరి

Featured Image

వినాయక నవరాత్రుల్లో భాగంగా అమెరికా బే ఏరియాలోని సత్యనారాయణస్వామి దేవస్థానంలో హృదయ నాదం పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. సంగీతం ద్వారా మానసిక ప్రశాంతత చేకూర్చే ప్రక్రియను సంగీతకారుడు వీణాపాణి నిర్వహించారు. సంగీతంపై అనేక ప్రయోగాలు చేసిన ఆయన SMART (SYNCRANIZED music and Relief Therapy) అనే నూతన ప్రక్రియను వివరించారు.

భారతీయ సంస్కృతిలో సంగీతం భాగం. ఉరుకుల పరుగుల జీవితాలతో ప్రతిఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మానసిక ప్రశాంతతను చేకూర్చే సంగీతాన్ని వీణాపాణి రూపొందించారు. ఈ ప్రక్రియతో గిన్నీస్‌లో ఆయన స్థానం సంపాదించారని వక్తలు కొనియాడారు. వీణాపాణిని ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావుగారు, ఆలయ కమిటీ నిర్వాహకులు మారేపల్లి నాగ వెంకటశాస్త్రి, తల్లాప్రగడ రావు, నేమాని రాజశేఖర్, మృదంగ విద్వాన్ నేమాని భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Hrudaya Nadam Music Relief Therapy By Veenapani In Bay Area

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles