పొట్లూరి రవి ఆర్థిక చేయూత..వైద్య విద్యకు అర్హత సాధించిన విద్యార్థిని

Featured Image

ఫిలడెల్ఫియాకు చెందిన కర్నూలు జిల్లా ప్రవాసాంధ్రుడు, తానా బోర్డ్‌ డైరెక్టర్ పొట్లూరి రవి కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, మహిళల స్వయం ఉపాధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్నారు.

కప్పట్రాళ్ళ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని మైమూన్‌ విద్యాభ్యాసానికి ఆయన $1.75 లక్షలు అందించి ప్రైవేటు రెసిడెన్షియల్ కాలేజీలో చదివించారు. ఈ ప్రోత్సాహంతో మైమూన్ EAPCETలో 6947 ర్యాంకు సాధించి వెటర్నరీ కాలేజీలో వైద్య విద్యకు అర్హత సంపాదించింది. ఈ సందర్భంగా రవి ఆమెను కలిసి అభినందించారు. మైమూన్‌ మాట్లాడుతూ...రవి సహాయం మరువలేనిదని తనలాంటి ఆర్ధికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆయన ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదీష్ రెడ్డి అనుముల, టిటిడి బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్, ముప్పా రాజశేఖర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Inter student supported by Ravi Potluri qualifies for veterinary medicine

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles