ఏపీ బీజేపీలో పాతూరికి ప్రమోషన్

Featured Image

గుంటూరు జడ్పీ మాజీ ఛైర్మన్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించిన పాతూరి నాగభూషణానికి ఆ పార్టీలో పదోన్నతి లభించింది.

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర పదాధికారుల కమిటీని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ప్రోటోకాల్ మరియు కార్యక్రమాల ఇన్‌ఛార్జిగా పాతూరిని నియమించారు. క్రమశిక్షణ కలిగిన నేతగా ఆయనకు ఉన్న గుర్తింపుతో ఈ పదవి లభించింది. ఈ సందర్బంగా నాగభూషణం మాట్లాడుతూ ఈ పదవి రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కి ధన్యవాదాలు తెలిపారు.

Tags-Paturi Nagabhushanam Is Now Protocol And Programmes Incharge In AP BJP

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles