డీసీలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం

Featured Image

వాషింగ్టన్ డీసీలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భానుప్రకాష్ మాగులూరి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ప్రముఖ ప్రవాసాంధ్ర విద్యావేత్త డాక్టర్ మూల్పూరి వెంకటరావుని ఈ సందర్భంగా ప్రవాస భారతీయ తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు. అనుభవమే ఆస్తిగా కలిగిన వృద్ధులు తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందిస్తారని, చరిత్రను బదిలీ చేసే వారధిగా సమాజానికి మంచి చేస్తున్నారని వక్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కామేశ్వరరావు, శ్రావ్య చామంతి, గోన మోహనరావు, పునుగువారి నాగిరెడ్డి, మేకల సంతోష్ రెడ్డి, బండి సత్తిబాబు, నంబూరి చంద్రనాథ్, గుంటుపల్లి నరసింహారావు, చల్లా సుబ్బారావు, వనమా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags-Senior Citizen Day Celebrations in Washington DC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles