రాలెలో పద్మశ్రీ గ్రహీతలకు ఆటా సత్కారం

Featured Image

ఆటా రాలె విభాగం ఆధ్వర్యంలో హరికథా కళాకారిణి పద్మశ్రీ డి.ఉమా మహేశ్వరి, ఆంధ్రనాట్యం ఆచార్యులు డా. కాలా కృష్ణని సత్కరించారు. చిన్నారులు సహస్ర కురపాటి, స్నిగ్ధ చందూరి అతిథులను పరిచయం చేశారు.

కార్యక్రమంలో ఉమా మహేశ్వరి హరికథా ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది. సంస్కృతంలో హరికథ చెప్పిన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. అభినవ సత్యభామగా పేరుగాంచిన డా. కాలా కృష్ణ ఆంధ్రనాట్యం, కూచిపూడి, భారతనాట్యంలో తన అనుభవాలను పంచుకున్నారు.

ఆటా బోర్డు సభ్యురాలు సాయి సుధిని, మాజీ అధ్యక్షురాలు మధు బొమ్మినేని, సాంస్కృతిక విభాగ అధ్యక్షురాలు కవిత కొండా, శివ గీరెడ్డి, పవన్ నోముల, శివకుమార్ త్రిపురారి, దీపికా మాలే, రాజు కురపాటి, అజయ్ మడ్డి, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags-Padmasri Awardees Felicitated By ATA Raleigh

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles