చామర్తి మమతకు వుమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

Featured Image

మిషిగన్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఇన్ టెక్నాలజీ (MCWT) వార్షికోత్సవంలో హైదరాబాద్‌కు చెందిన ప్రవాసాంధ్రురాలు మమతా చామర్తికి 2025 'వుమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును ప్రదానం చేశారు. డెట్రాయిట్‌లోని MGM గ్రాండ్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు మిషిగన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ రంగ నిపుణులు, ఆవిష్కర్తలు, వాణిజ్యవేత్తలు హాజరయ్యారు. టెక్నాలజీ రంగంలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో MCWT కీలకపాత్ర పోషిస్తుంది.

మమతా చామర్తి టెక్నాలజీ, ఆటోమోటివ్, మాన్యుఫాక్చరింగ్, యుటిలిటీ రంగాల్లో దీర్ఘకాలంగా పనిచేసి అనుభవం గడించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కార్యక్రమాలను ముందుండి నడిపారు. పాత వ్యవస్థలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేశారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఉద్యోగ స్థలాల్లో సమానతను నెలకొల్పడం, కొత్త తరానికి మార్గదర్శకత్వం ఇవ్వడంలో ఆమె చేసిన కృషికి ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మమతా మాట్లాడుతూ...నిజమైన మార్పు సాంకేతికతలో గాక చేసే పనిలో మంచితనం, విలువలు, ఐకమత్యం ఉండాలన్నారు. ప్రతి మహిళ విజయాల వెనుక ఉన్న స్నేహితుల ప్రోత్సాహం, సహకారం ఆ ప్రయాణాన్ని బలపరుస్తుందని విశ్వసిస్తానని ఆమె పేర్కొన్నారు. MCWT అధ్యక్షురాలు జిల్ మయోరానో సంస్థ లక్ష్యాలను వివరించారు. మహిళలకు టెక్నాలజీ రంగంలో అన్ని దశల్లో అవకాశాలు కల్పించడం, టెక్ శిబిరాలు నిర్వహణ, కాలేజ్ స్కాలర్‌షిప్‌లు వంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు మద్దతు ఇవ్వడం తమ సంస్థ ప్రణాళికలని వెల్లడించారు.

Tags-Chamarti Mamatha Of Detroit Felicitated With MCWT Women Of The Year 2025 Award

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles