కృత్రిమ మేథస్సును భావోద్వేగాలతో సమతుల్యం చేసుకోవాలి-జస్టిస్ ఎన్వీ రమణ

Featured Image

అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి, క్వాంటం టెక్నాలజీ వంటి అంశాలపై విట్ 5వ స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ మాట్లాడారు. విట్ వంటి సంస్థలు కూడా గత ఐదేళ్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాయని తెలిపారు. నేటి సమాచార యుగంలో సైతం ఖచ్చితమైన సమాచారం పొందడం కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు. వార్తల వక్రీకరణ, పార్టీలకు అనుగుణంగా పనిచేసే మీడియా ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు. స్వేచ్ఛ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ప్రతి అంశాన్ని ట్రోల్ చేయటం, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయటం, మానసిక వేదనకు గురిచేయటం సరికాదన్నారు.

సమాచార సృష్టి పేరుతో అత్యల్ప స్థాయికి దిగజారిపోయామని ఆవేదన వెలిబుచ్చారు. సోషల్ మీడియాకు బానిసలైన వారు డిజిటల్ ప్రపంచం నుంచి బయటకు రాలేకపోతున్నారన్నారు. కంటెంట్ నిజస్వరూపం ఇప్పుడు సమస్యగా మారిందని... ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేయటం, డీప్ ఫేక్ వంటి సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో బాధితులకు సాయం చేసే సమర్థమైన న్యాయ యంత్రాంగం లేదని, ఆన్ లైన్‌ను నియంత్రించటం కష్టమైందన్నారు. కృత్తిమ మేథ వంటి సాంకేతికత మనుషులకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని అభిప్రాయపడ్డారు. ఎంఐటీ తాజా అధ్యయనం ప్రకారం, జనరేటివ్ AIను తమ వ్యాపారాల్లో ప్రవేశపెట్టిన సంస్థల్లో 95 శాతం విఫలమయ్యాయని.. 5 శాతం సంస్థలు మాత్రమే ఆదాయం పెంచుకున్నాయని తెలిపారు. కృత్రిమ మేధస్సు అనేది మానవ మేధస్సుకు ఒక సాధనం మాత్రమేనని స్పష్టం చేశారు. పూర్తిగా AI మీద ఆధారపడితే మానవ ఆలోచనా శక్తిని కోల్పోతామ్నారు. కృత్రిమ మేధస్సును భావోద్వేగాలతో సమతుల్యం చేయకుంటే మానవ జీవితం, గౌరవం కూడా వస్తువులా మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Tags-AI Must Embrace Emotional Intelligence - Justice NV Ramana

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles