Brunei-దారుస్సలాం తెలుగు సంఘం దీపావళి

Featured Image

బ్రూనైలోని దారుస్సలాం తెలుగు సంఘం దీపావళి పండుగను సేవా కార్యక్రమాలతో అర్థవంతంగా జరుపుకుంది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు విల్లేజ్ పందాన్ బి ప్రాంతంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్రతి త్రైమాసికం ఈ ప్రాంతాన్ని శుభ్రపరచే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సంఘం ఈ సారి ఏడు ట్రక్కుల వ్యర్థాలను సేకరించి టెలిసాయ్ రీసైక్లింగ్ సెంటర్‌కు తరలించింది. కార్యక్రమాన్ని సొమునాయుడు దాది, సతీష్ పొలమత్రసెట్టి సమన్వయం చేయగా, రమేష్ బాబు బదరవూరి, చింత వెంకటేశ్వరరావులు సహకరించారు.

రిపాస్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. 30 మందికి పైగా సభ్యులు పాల్గొనగా, 24 యూనిట్ల రక్తం సేకరించారు. ఈ కార్యక్రమాన్ని నవీన్ కుమార్ సురపనేని సమన్వయం చేశారు. సంఘ కార్యకలాపాలను భారత రాయబారి రాము అబ్బగాని, పుష్పా అబ్బగాని అభినందించారు. అధ్యక్షుడు వెంకటరమణరావు సూర్యదేవర మాట్లాడుతూ, దీపావళి పండుగ వెలుగు, ఆత్మీయత, సేవకు ప్రతీక. శుభ్రతా కార్యక్రమాలు, రక్తదానం వంటివి ఈ పండుగను మరింత అర్థవంతం చేస్తాయని తెలిపారు.

Tags-Brunei Telugu NRI NRT News Darussalem Telugu Assoc Diwali 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles