నాష్‌విల్‌లో ఆటా వాణిజ్య సదస్సు

Featured Image

టెన్నిస్సీ రాష్ట్రం నాష్‌విల్‌లో ఆదివారం నాడు ఆటా ప్రాంతీయ వాణిజ్య సదస్సు ఏర్పాటు చేశారు. ఆతిథ్య, బ్యాంకింగ్, విద్యా, మహిళా సాధికారత, కృత్రిమ మేథ, రియల్ ఎస్టేత్ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొని పలు అమూల్యమైన సూచనలు చేశారు. ఆటా అధ్యక్షుడు చల్లా జయంత్ పాల్గొని సదస్సుని విజయవంతం చేయడానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. విలువ ఆధారిత, సమాజ హిత కార్యక్రమాలకు ఆటా ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు.

నాష్‌విల్ ఆటా విభాగ ప్రతినిధులు నూకల వంశీ, రాచకొండ సాయిరాం, చందా ఇషాన్, నూకల నరేందర్, చంద సుశీల్, గూడూరు కిషోర్, రామకృష్ణారెడ్డిలు ఈ సదస్సును సమన్వయపరిచారు. ఆటా బిజినెస్ కమిటీ ఛైర్ బత్తిని హరీష్ కీలకపాత్ర పోషించారు. తదుపరి అధ్యక్షుడు సతీష్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు బోదిరెడ్డి అనీల్, శ్రీరాం శ్రీనివాస్, బిజినెస్ కమిటీ కో-ఛైర్ రమణ గండ్ర, కెంటకీ రీజినల్ కో-ఆర్డినేటర్ జానకిరాం వంగూర్, వంశీ పోలవరపు, రవళి కల్లు తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Regional Business Summit In Nashville TN

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles