న్యూజెర్సీలో మీట్ విత్ మన్నవ మోహనకృష్ణ

Featured Image

ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) చైర్మన్ మన్నవ మోహనకృష్ణ న్యూజెర్సీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. వ్యాపార వేత్తలు, టీడీపీ నాయకులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సాంకేతికత, పారిశ్రామికత, ఇన్నోవేషన్ రంగాల్లో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

మంత్రి నారా లోకేష్ నాయకత్వం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని మోహన కృష్ణ పేర్కొన్నారు. టెక్నాలజీపై లోకేష్ అవగాహన, ఆధునిక ఆలోచన, ప్రజలతో సాన్నిహిత్యం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తోందన్నారు. ఇటీవల గూగుల్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం రాష్ట్రానికి సాంకేతిక రంగంలో పెద్ద అవకాశాలను తెస్తుందని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్లు, AI పరిశోధనా కేంద్రాలు, స్టార్టప్‌ల మద్దతు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చుతాయని వివరించారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని మోహన కృష్ణ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని, పెద్ద స్థాయి పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పునఃప్రారంభమైందని చెప్పారు. ఇది రాజకీయ కూటమి కాదని అభివృద్ధి కూటమి అని వెల్లడించారు.

ప్రవాసులు...పరిశ్రమలు స్థాపించి, పెట్టుబడులు పెట్టి, టెక్నాలజీ పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి అందించాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ యాత్రలో ఎన్నారైలు కీలకమని చెప్పారు. అనంతరం మోహనకృష్ణను సత్కరించారు.

Tags-Meet With APTS Chairman Mannava Mohanakrishna in New Jersey

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles