రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌తో వ్యాధి నిర్మూలన

Featured Image

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నాట్స్ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు, చికిత్సపై ఉన్న అపోహలను తొలగించే నిమిత్తం దీన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు మందాడి శ్రీహరి పేర్కొన్నారు.

సరైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని వక్తలు వెల్లడించారు. నాట్స్ పూర్వ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ బోర్డు డైరెక్టర్ బిందు యలమంచిలిలు ఈ సదస్సు నిర్వహణను సమన్వయపరిచారు. నాట్స్ న్యూజెర్సీ సభ్యులు సురేంద్ర పోలేపల్లి, సాయి లీలా మాగులూరి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ శ్రీనివాస్ భీమినేని, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందడి, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, గంగాధర్ దేసు, శ్రీదేవి జాగర్లమూడి, గాయత్రి చిట్టేటి, స్వర్ణ గడియారం, స్మిత, సాగర్ రాపర్ల, మౌర్య యలమంచిలి, రమేష్ నూతలపాటి, వంశీ వెనిగళ్ల తదితరులు పాల్గొన్నారు.

Tags-NATS Telugu New Jersey Conducts Breast Cancer Awareness In Edison

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles