బాల్టిమోర్‌లో ఘనంగా ఆటా సంబరాల సన్నాహక సమావేశం

Featured Image

2026 జులై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో నిర్వహించనున్న 19వ అమెరికా తెలుగు సంఘం(ఆటా) ద్వైవార్షిక మహాసభల సన్నాహక సమావేశాన్ని శనివారం నాడు బాల్టిమోర్‌లో నిర్వహించారు. $1.4 మిలియన్ డాలర్ల నిధులను ఈ సదస్సు ద్వారా సేకరించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

30 మంది ట్రస్టీలు, అమెరికా దేశం నలుమూలల నుండి 300 మంది ఆటా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సంస్థ లక్ష్యాలు, సభల ప్రణాళిక, సేవా కార్యక్రమాలపై ఈ సందర్భంగా చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు సంస్కృతి, భాష, విద్య, సాధికారత, వ్యాపార నెట్‌వర్కింగ్ సేవలను ప్రోత్సహించడానికి ఆటా అంకితభావంతో పనిచేస్తోందని వెల్లడించారు. 19వ ఆటా సభలు విజయవంతం చేయ్వల్సిందిగా అధ్యక్షుడు జయంత్ చల్లా కోరారు. అనంతరం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటరును సందర్శించారు.

సభల నిర్వాహక కోర్ బృందాన్ని ప్రకటించారు.

కన్వీనర్ - శ్రీధర్ బనాల(మేరీల్యాండ్)

సమన్వయకర్త - రవి చల్లా(వర్జీనియా)

జాతీయ సమన్వయకర్త - శరత్ వేముల(న్యూజెర్సీ)

డైరెక్టర్ - సుధీర్ దామిడి(వర్జీనియా)

కో-కన్వీనర్ - అరవింద్ ముప్పిడి(టెక్సాస్)

కో-కోఆర్డినేటర్ - జీనాథ్ కుందూర్(వర్జీనియా)

కో-నేషనల్ సమన్వయకర్త - కౌశిక్ సామ(వర్జీనియా)

కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ - తిరుమల్ మునుకుంట్ల(వర్జీనియా)

కో-డైరెక్టర్ - కిరణ్ అలా(డెలావేర్)

అడ్ హాక్ మానిటరింగ్, సపోర్ట్ టీమ్‌

● రామకృష్ణ ఆలా, టెన్నిస్సీ

● రఘువీర్ మర్రిపెద్ది, టెక్సాస్

● విజయ్ కుందూర్, న్యూజెర్సీ

● జెపి ముద్దిరెడ్డి, టెక్సాస్

● రాజు కాకెర్లా, పెన్సిల్వేనియా

● మహీధర్ ముస్కుల, ఇల్లినాయిస్

Tags-ATA 19th Conference Kickoff Event In Baltimore Maryland, ATA 19th Conference Jul 31 - Aug 02 2026

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles