H4-EAD రెన్యూవల్‌పై సమీక్ష తప్పనిసరి

Featured Image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరో బాంబును పేల్చింది. కొత్తగా తీసుకున్న నిబంధనలతో H-1B వీసాదారుల జీవిత భాగస్వాములు, F-1 విద్యార్థులు, అమెరికాలో ఆశ్రయం కోరే వారిని ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులు H-1B వీసాదారులలో అత్యధిక వాటాను కలిగి ఉన్న భారతీయ వర్కర్లను ప్రభావితం చేస్తాయి.

గతంలో బైడెన్ ప్రభుత్వం H-1B హోల్డర్ల జీవిత భాగస్వాములు (H-4), F-1 విద్యార్థులు (Optional Practical Training – OPT)లకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్‌స్ (EADs) ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడేవి. అయితే, తాజా నిర్ణయాలతో ఇకపై వీరి వర్క్ పర్మిట్‌లను రీన్యూ చేయించుకోవడానికి పరిశీలన ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. అంటే, ఇకపై ఆటోమెటిక్ పునరుద్ధరణ ఉండబోదు. ఖచ్చితంగా వర్క్ పర్మిట్ల కోసం స్క్రీనింగ్, పరిశీలనకు గురి అవుతారు.

F-1 విద్యార్థులు (OPT), అంటే చదవు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం ప్రారంభించే వారికీ, అప్లికేషన్ ఆలస్యమైతే ఉద్యోగం తాత్కాలికంగా ఆగిపోవచ్చు. 2024లో అమెరికాలో 4.22 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో 27శాతం. H-4 వీసా హోల్డర్లు , వీరిలో చాలా మంది H-1B హోల్డర్ల భార్యలు/భర్తలు ఉన్నారు. వీరికి వర్క్ పర్మిట్ లేకపోతే కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అధికారిక గణాంకాల ప్రకారం, అమెరికాలో H-1B వీసాల 71% భారతీయులు ఉన్నారు.

Tags-Trump Administration Mandates Review Of H4 And F1 EAD Renewal

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles