టొరంటోలో ఒంటారియో తెలుగు ఫౌండేషన్ దీపావళి వేడుకలు

Featured Image

ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు టొరంటో ఈస్ట్‌డేల్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు కుటుంబాలు, పిల్లలు పాల్గొని వేడుకను ఆస్వాదించారు. భావన పగిడేలా, అపర్ణ కందుల, రిందా శాంతపురం, విలోక్ చల్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. మహిళా సమన్వయకర్తలు ఝాన్సీ బదాపురి, దీప సూదిరెడ్డి, పద్మిని నారు, గీత రెడ్డిచెర్ల, శ్రీదేవి నీల, లావణ్య ఆలూరి జ్యోతి ప్రజ్వలనతో దీపావళి వేడుకలకు శ్రీకారం చుట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నృత్యాలు, పాటలు, సంప్రదాయ కళారూపాలు ఆకట్టుకున్నాయి.

ప్రవీణ్ నీల, మురళీధర్ పగిడేలా మాట్లాడుతూ హైందవ సంస్కృతిని, తెలుగు సంప్రదాయాలను కాపాడే ఇలాంటి కార్యక్రమాలు కమ్యూనిటీ ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. ప్రధాన అతిథులుగా ICICI బ్యాంక్ కెనడా CEO హిమదర్ మద్దిపట్ల, ఆయన సతీమణి అనిత, Pickering MP జునైటా నాథన్, రీజినల్ కౌన్సిల్ మలీహా షాహిద్ హాజరయ్యారు.

Tags-Ontario Telugu Foundation OTF Diwali 2025 In Toronto Canada

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles