పిట్స్‌బర్గ్ నాట్స్ విభాగ తొలి వార్షికోత్సవం

Featured Image

పిట్స్‌బర్గ్‌లో నాట్స్ తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రతిభా పురస్కారాలతో ఈ వేడుకలు అలరించాయి. స్థానిక తెలుగు విద్యార్థులు గణేశ ప్రార్థనతో ఉత్సవం ప్రారంభించారు. పియానో, వయోలిన్ వంటి వాయిద్యాలతో చిన్నారులు సంగీత ప్రతిభను ప్రదర్శించారు.

గాయకులు హరి గుంట, శ్రావ్యల సంగీత కచేరీ ఆకట్టుకుంది. స్పెల్‌బీ, లీగో క్రియేషన్, చిత్రలేఖనం, గణితం, చదరంగం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఆటిజం పిల్లల కోసం ప్రత్యేకంగా పీస్ బై పీస్ పజిల్ కార్యక్రమాన్ని అభినందించారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నేషనల్ కోఆర్డినేటర్ మార్కెటింగ్ కిరణ్ మందాడి, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మెంట, మిడ్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ దగ్గుపాటి, శంకర్ జెర్రిపోతుల తదితరులు పాల్గొన్నారు.

Tags-Pittsburgh NATS Chapter Celebrates First Anniversary

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles