🕑 Published: April 22, 2026 at 09:03 PM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) హైవే దత్తత కార్యక్రమం ద్వారా సామాజిక స్పృహను చాటిచెప్పింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా న్యూజెర్సీలో ఈస్ట్ విండ్సర్ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో స్థానిక చిన్నారులు, విద్యార్థులను నాట్స్ భాగస్వామ్యులను చేసింది. రహదారి పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించారు. విద్యార్థులు బాల్యం నుండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో క్రమశిక్షణ, సామాజిక స్పృహ పెరుగుతాయని నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో నాట్స్ కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. నాట్స్ ఎడాప్ట్ ఎ హైవేలో పాల్గొన్నవారిని చైర్మన్ కిషోర్ కంచర్ల అభినందించారు.


