సెయింట్‌లూయిస్‌లో చంద్రబాబు జన్మదినోత్సవం

🕑 Published: April 20, 2026 at 03:29 PM CST

అమెరికాలోని సెయింట్ లూయిస్ నగర NRITDP విభాగం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం రక్తదాన శిబిరంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పార్టీ తరఫున ప్రశంసాపత్రాలు అందజేశారు. కూటమి కార్యకర్తల కోలాహలం మధ్య జన్మదిన వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రవాసాంధ్రులు చంద్రబాబు జన్మదినాన్ని తమ ఇంటి పండుగలా జరుపుకున్నారు.

ఈ వేడుకల్లో NRITDP సభ్యులు చెంచు వేణుగోపాల్ రెడ్డి(అధికార ప్రతినిధి), ఎన్నారై తెదేపా ప్రాంతీయ ప్రతినిధి రాజా సూరపనేని, సురేన్ పాతూరి, కిషోర్ ఎర్రపోతిన, రవి పొట్లా, సుధాకర్ నర్రా, వంశీ పాతూరి, వీరా, నాగకుమార్ బెల్లంకొండ, వెంకట్ గౌని, మురళి పుట్టగంటి, పల్లవి సూరపనేని, శ్రీకాంత్ సూరపనేని, తాళ్లూరి లకుమ, పిడికిటి రాధ, జనసేన నాయకులు విజయ్ సాక్షి, సత్య తదితరులు పాల్గొన్నారు.

తెదేపా నేతలు పల్లా శ్రీనివాసరావు, రఘురామరాజు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తమ సందేశాలను పంపించారు. చంద్రబాబునాయుడు సారథ్యంలో చేపడుతున్న రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు, అమరావతి నిర్మాణానికి ప్రవాసుల తరఫున పూర్తి మద్దతు ఉంటుందని కూటమి సభ్యులు ఈ సందర్భంగా ప్రకటించారు.

📲 Join Our WhatsApp Channel
నాట్స్ వెలెనెస్ వెబినార్‌లో ఘట్టమనేని మంజుల సూచనలుజర్మనీలో జై చంద్రబాబు..ఘనంగా జన్మదిన వేడుకలుఆస్ట్రేలియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలుశంకర నేత్రాలయకు $555,000 డాలర్ల విరాళం అందజేసిన అరవింద్ కృష్ణస్వామిఫిలడెల్ఫియాలో TAGDV ఉగాది సాంస్కృతిక పోటీలుమహబూబాబాద్ జిల్లాలో చేతన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు"ఆటా" సభల్లో స్టాల్ ఏర్పాటు చేయాలనుకునేవారికి శుభవార్తతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ఈస్టర్ ఎగ్ హంట్ - TANA Mid Atlantic Conducts 2026 Easter Egg Huntన్యూయార్క్‌లో డా. నోరిని సత్కరించిన అమెరికన్ పంజాబీ సొసైటీడల్లాస్‌లో వైభవంగా టాంటెక్స్ ఉగాది మహోత్సవంతితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావుకు కీలక బాధ్యతలున్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ బరిలో సరితాUNMCతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఒప్పందంఆటా సాంస్కృతిక పోటీల నమోదుకు చివరి తేదీ ఇదేపుస్తకాలతోనే సంస్కారవంతమైన సామాజికాభ్యుదయం సాధ్యంవాషింగ్టన్ డీసీలో అమరావతి చట్టబద్దతపై ఆనందోత్సాహాలుఅమరావతి అజరామరం...బే-ఏరియాలో వేడుకఆస్ట్రేలియాలో అమరావతి సంబరంఒమాన్‌లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణంసౌదీలో అమరావతి విజయోత్సవం
No Previous Next Article