డెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానం

🕑 Published: June 21, 2026 at 12:00 PM CST

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అభినందన సభ డెట్రాయిట్ లోని ఫర్మింగ్టన్ హిల్స్ మేనర్ లో శుక్రవారం నాడు వైభవంగా జరిగింది. ఎన్నారై టిడిపి డెట్రాయిట్, మిచిగన్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. అటు సంక్షేమంతోపాటు, ఇటు పెట్టుబడులకోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ఎన్నారైలు కూడా పాలుపంచుకోవాలని కోరారు. ఐటీ, టూరిజం, విద్య, వైద్యరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఎన్నారైలు తమవంతుగా రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారాన్ని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి ఎన్నారైలు తోడ్పాటును అందించాలని కోరారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రగతికోసం కృషి చేస్తున్నారని వెల్లడించారు.

గంగాధర్ నాదెళ్ళ, సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల, జోగేశ్వరరావు పెద్దిబోయిన, సురేష్ పుట్టగుంట, వాసు గన్నమనేని, రాంప్రసాద్ చిలుకూరి, సతీష్ వేమన, నరేన్ కొడాలి, బండ్ల హనుమయ్య, జయశేఖర్ తాళ్ళూరి, బిజెపి మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పాతూరి నాగభూషణం, సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, లక్ష్మీనారాయణ సూరపనేని, రాజా సూరపనేని, శ్రీకాంత్ దొడ్డపనేని తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
వర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంసిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందంఅమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభంఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమంవిజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళిడెన్మార్క్‌లో మినీ మహానాడు విజయవంతంజర్మనీలో బాలకృష్ణ జన్మదిన వేడుకలులోకేశ్ ఓఎస్డీ డా.వరప్రసాద్‌కు రెండు బంగారు పతకాలుచికాగోలో గాయపడిన స్పందనకు "ఆటా" చేయూతఐఐటీఎం ప్రవర్తక్‌తో "టెక్‌సొరా" ఒప్పందంఅమెరికాలోని తెలుగు విద్యార్థులకు రూపాయి శాపంసాంకేతిక ఆవిష్కరణలకు సంస్కృత భాష అధ్యయనం తప్పనిసరి
Previous Article Next Article