🕑 Published: June 23, 2026 at 11:02 AM CST
దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ‘పద్మ’ అవార్డుల (Padma awards 2026) రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) మంగళవారం సాయంత్రం ఈ అవార్డులను ప్రదానం చేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు పి.నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా.. సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్‌తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మ భూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి నేడు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నవారిలో సినీ నటులు మాగంటి మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
