లండన్‌లో కామారెడ్డి యువకుడి మృతి

🕑 Published: June 26, 2026 at 01:46 PM CST

లండన్‌లో తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి (25) రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం శ్రీనాథ్‌ గతేడాదే లండన్‌కు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి లండన్‌లోని లీసెస్టర్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

రెండు రోజుల క్రితం స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన శ్రీనాథ్‌.. రాత్రి అక్కడే నిద్రించాడు. తెల్లవారేసరికి విగతజీవిగా పడి ఉన్నట్లు స్నేహితులు అక్కడే ఉన్న శ్రీనాథ్‌ బంధువులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మరణ వార్తతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీనాథ్‌ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వగ్రామానికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

📲 Join Our WhatsApp Channel
పద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవండెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానంఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళంవర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంసిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందంఅమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభంఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమంవిజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరంAttention USA Parents - ATA SAT Coaching 2026 - Registration Now Open!ఎన్‌టీఆర్‌కు ఆస్టిన్ ప్రవాసుల ఘన నివాళి
Previous Article Next Article