🕑 Published: June 29, 2026 at 12:40 PM CST
'కళారత్న' కె.వి. సత్యనారాయణ రచన-నృత్య దర్శకత్వంలో రూపొందిన కూచిపూడి నృత్య రూపకం రుక్మిణీ కళ్యాణం అమెరికాలోని డెన్వర్‌లో ఆదివారం నాడు విజయవంతంగా ప్రదర్శించారు. 'స్పిరిచువల్ టాబ్లెట్స్' (Spiritual Tablets) స్థానిక విభాగం, 'ఆర్ట్స్ & మెడిటేషన్' (Arts & Meditation) సంస్థల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. లక్ష్మి తలంకి, శ్రీధర్ తలంకిలు సమన్వయపరిచారు. స్థానిక ప్రముఖ నృత్య కళాకారిణి కీర్తన జ్యోతిరామన్ తన శిష్య బృందం మరియు ఇతర స్థానిక కళాకారులతో కలిసి ఈ ప్రదర్శనలో కీలకపాత్ర పోషించారు. కీర్తన జ్యోతిరామన్ (విష్ణువుగా), అనన్య శ్రీ తలంకి (రుక్మిణిగా), శ్రీయ కాసు (కృష్ణుడిగా), రెంజు పెరూర్ (రుక్మిగా), లిసోనా సైమన్ (లక్ష్మీదేవిగా), జెన్సీ జాకబ్ (నారదుడిగా) ఇతర పాత్రలలో కృష్ణ శ్రీ చల్ల, లయ మృణాళి అల్లు, సింధుష మలియాల, ఆశా కామత్, నవ్యశ్రీ మంద, మయూఖ బైరి, త్రిష మరోజు, లావణ్య కండిపాటి, లక్ష్మి తలంకి, కేశవ్ తలంకి, అర్జున్ పెరూర్, కేశవ్ అభిలాష్ అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. రుక్మిణీ కళ్యాణం నృత్య రూపకం అమెరికాలో ప్రదర్శితం కావడం పట్ల కె.వి. సత్యనారాయణ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కళారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా కె.వి. సత్యనారాయణను సత్కరించారు.
The Kuchipudi dance drama Rukmini Kalyanam—written and choreographed by 'Kala Ratna' K.V. Satyanarayana—was successfully performed on June 28, 2026, in Denver, USA, under the auspices of the local chapter of spiritual tablets in collaboration with arts & meditation. The event was organised through the dedicated efforts of Smt. Lakshmi Talanki and Sri Sridhar Talanki, who are known for their commitment to cultural service. Renowned local dancer Keerthanna Jothiraman played a pivotal role in the production, performing alongside her group of students and other local artists. Keerthanna Jothiraman - (as Vishnu), Kumari Ananya Sri Talanki - (as Rukmini), Sriya Kasu - (as Krishna), Renju Peroor - (as Rukmi ), Lisona Simon - (as Lakshmi Devi), Jency Jacob - (as Narada), other characters. Krishna Sri Challa, Laya Mrinali Allu, Sindhusha Maliyala, Asha Kamat, Navyasri Manda, Mayukha Bairy, Trisha Maroju, Lavanya Kandipati, Lakshmi Talanki, Keshav Talanki, Arjun Peroor and Kesav Abhilash delivered outstanding performances that won the audience's acclaim. K.V. Satyanarayana expressed his happiness at the US premiere of the Rukmini Kalyanam dance drama. Subsequently, Sri Sridhar Talanki honoured K.V. Satyanarayana in recognition of his artistic contributions. The audience also extended special appreciation to all the participating artists.

