🕑 Published: June 26, 2026 at 01:57 PM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సెయింత్ లూయిస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ సెంటర్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహంచారు. సమాజ సేవలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
శిబిరంలో నాట్స్ మెడికల్ డైరెక్టర్, అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ అట్లూరి సేవలు అందించారు. హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన సలహాలు, సూచనలు, మందులు ఇచ్చారు. నిపుణులైన వైద్యుల నుండి ఉచితంగా వైద్య సేవలు అందడం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమ నిర్వహణలో నాట్స్ ప్రస్తుత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, నేషనల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ కొల్లిపర కీలకపాత్ర పోషించారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడలు సెయింట్ లూయిస్ నాట్స్ విభాగాన్ని అభినందించారు.
