ఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్

🕑 Published: June 26, 2026 at 02:01 PM CST

‘ఫాదర్స్‌ డే’ను పురస్కరించుకొని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని వ్యాలీ ఫోర్జ్ నేషనల్ హిస్టారికల్ పార్కులో జూన్‌ 21న ‘నాన్నతో నడక’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ ప్రతినిధి ఫణి కంతేటిలతో పాటు, ఈ కార్యక్రమానికి సూచనలు, మార్గదర్శకత్వం చేసిన తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటుడు సుమన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రతి ఒక్కరి జీవితంలో నాన్న పాత్ర ఏంటో ఆయన తెలియజేశారు. మిమిక్రీ రమేశ్‌ తన పాటలు, ప్రదర్శనలతో అలరించారు. మఖ్దూమ్‌ సయ్యద్‌, ఉమాకాంత్‌ స్ఫూర్తిదాయక ప్రసంగాలు ప్రేరణ కలిగించాయి. దాదాపు 200 మందికిపైగా తండ్రులు, వారి పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన సురేశ్‌ యలమంచిలి, సునీల్ కోగంటి, రంజిత్ మామిడి, శ్రీధర్ సాదినేని, దీప్తి కోక, సంతోష్ రౌతు, చలం పావులూరి, కృష్ణ నందమూరి, విశ్వనాథ్ కోగంటి, ప్రసాద్ కస్తూరి తదితరులకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈవెంట్ కోసం అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లందరికీ ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ భోజన వసతి కల్పించారు.

📲 Join Our WhatsApp Channel
సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవండెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానంఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళంవర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంసిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందంఅమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభంఏపీ ప్రగతిలో ప్రవాసులది కీలక పాత్ర-గాలి భానుప్రకాష్చికాగోలో నాట్స్ సేవా కార్యక్రమంవిజయవంతంగా తానా మహిళల త్రోబాల్ టోర్నమెంట్అమెరికావ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న ఆటా సాంస్కృతిక కార్యక్రమాలుఆమ్‌స్టర్‌డామ్‌లో ఎన్టీఆర్ 103వ జయంతితితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంఆల్ఫరెట్టాలో గ్లోబల్ తెలంగాణా సంఘం అంతర్జాతీయ ఉత్సవంకువైట్‌ భారత రాయబార కార్యాలయంలో రక్తదాన శిబిరం
No Previous Next Article