🕑 Published: June 29, 2026 at 06:11 PM CST
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ట్రస్టులకు భారీ విరాళం అందింది. తితిదే నిర్వహిస్తున్న పలు ధార్మిక, సేవా ట్రస్టులకు హైదరాబాద్‌కు చెందిన లేవేన్ హోల్డింగ్స్ సంస్థ రూ.1.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. సోమవారం కంపెనీ మేనేజింగ్ పార్టనర్ వెంకట రవికుమార్ శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో తితిదే బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
