🕑 Published: July 14, 2026 at 11:38 AM CST
అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ తెలుగు కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో న్యూజెర్సీలో రాయలసీమ అమెరికన్ తెలుగు అసోసియేషన్(RATA) ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో వందలాది తెలుగు కుటుంబాలు పాల్గొని రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతను ప్రతిబింబించేలా సందడి చేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ రాయలసీమ ప్రజలను మాత్రమే కాకుండా అన్ని ప్రవాస తెలుగు కుటుంబాలను కలుపుకొని, భవిష్యత్తులో సాంస్కృతిక, సేవా, విద్యా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అమెరికా నేలపై తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు వెల్లడించారు.
