టాంటెక్స్ ఆధ్వర్యంలో 227వ సాహితీ సదస్సు

🕑 Published: July 06, 2026 at 10:08 AM CST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక "నెల నెలా తెలుగు వెన్నెల" 227వ సాహిత్య సదస్సు డాలస్‌లోని టెక్సాస్‌ నగరంలో జూన్‌ 21న ఘనంగా నిర్వహించారు. "తెలుగదేల యన్న" అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సుకు పారుపల్లి కోదండరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గత కొంతకాలంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరితో తెలుగు భాష అంతరిస్తున్న సూచనలు మన కళ్లముందే ఆవిష్కృతమవుతోందని, ఈ విషయాన్ని యునెస్కో గణాంకాలతో సహా తేల్చి చెప్పిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాలానుగుణంగా అందుబాటులో ఉండే తాటి ముంజెలు, సీమ చింతకాయలు, జాన కాయలు, కలే కాయలు వంటి వృక్ష ఆధారిత ఫలాలు, మన పూర్వీకుల నుంచి పండుగల వేళ తయారు చేసే ఆవిరి కుడుములు వంటి పిండి వంటలు, ఇంట ముంగిట ముగ్గులు వేసి అందంగా అలంకరించడానికి సాయపడే తంగేడుపూలు వంటివి పశ్చిమ దేశాల వారికి తెలియనందువల్ల ఇక్కడ పెరిగిన మన వారసులకు ఆ తెలుగు పేర్ల పదాలు తెలిసే అవకాశమే లేదన్నారు. సరికొత్త ఆంగ్ల పదాల ప్రభావం, సామాజిక మార్పుల వల్ల మన తెలుగు భాషలోని ఎన్నో అచ్చమైన, అర్థవంతమైన పదాలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మనం బంధువులను పిలిచే సమయంలో ఉపయోగించే నాయన, అయ్య, తల్లి, అమ్మ, అవ్వ, అత్త, అత్తయ్య, తోడికోడలు, మేనమామ, మామయ్యలకు బదులు మమ్మీ, డాడీ, ఆంటీ, అంకుల్‌ వంటి పిలుపులే వినబడుతున్నాయి. తమిళనాడు, కేరళ, నాగాలాండ్‌, మిజోరం వాసులు తమ మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తున్నారని, మన తెలుగు భాషా రాష్ట్రాల పాలకుల అలసత్వం కారణంగా మాతృభాషకు ఆ ప్రాధాన్యం దక్కడంలేదన్నారు. ఇక నుంచి ఆంగ్ల భాషా పదాలకు బదులుగా తెలుగు పదాలను వాడతామని, న్యాయస్థానాలతో సహా అన్ని శాఖల ఉత్తర్వుల్లోనూ తెలుగును విధిగా వాడాల్సిందిగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులకు ఈ-మెయిల్‌లో విజ్ఞాపనలు పంపిస్తామని అందరితోనూ ప్రమాణం చేయించారు. అనంతరం ముఖ్య అతిథికి సన్మానం చేసి సన్మాన పత్రాన్ని జ్ఞాపికగా అందజేశారు.

📲 Join Our WhatsApp Channel
అర్వింగ్ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద అమెరికా 250వ స్వాతంత్ర్యదినోత్సవంసైబర్ సెక్యూరిటీపై సచివాలయంలో APTS వర్క్‌షాప్నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవండెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానం
No Previous Next Article