తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం

🕑 Published: July 04, 2026 at 10:52 AM CST

తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మాగులూరి భానుప్రకాష్ సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో ఏపీ భాజపా మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగును కాపాడుకుందామని, మన చరిత్రను మన పిల్లలకు అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. మాతృభూమి-మాతృబాష మన విధానం మన నినాదమని అన్నారు. వృత్తి రీత్యా అమెరికాకు వచ్చినప్పటికీ అన్ని భాషలూ నేర్చుకుని మాతృభాషలో సంభాషించుకుందామని కోరారు.

భాను మాగులూరి మాట్లాడుతూ తెలుగు మన ఆస్తి, అస్తిత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు, శంకర్రావు పొన్నం, కృష్ణ మోహన్ జంపాల, సత్యనారాయణరాజు, చంద్రనాధ్ నంబూరు, వెంకట రెడ్డి గోలి, సుబ్బారావు చిట్టెల, రామకృష్ణ రెడ్డి, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటీ, సురేష్, యోగానంద్ వంకిన, నూరిబాబు షేక్, సురేష్ లగిశెట్టి, గణేష్ రెడ్డి బుడిపాటి, రాజా కరణం, రాజేంద్రప్రసాద్ పులిపాటి, ప్రభు బచ్చు తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవండెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానంఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళంవర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంసిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందంఅమరావతిలో తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ ప్రారంభం
No Previous Next Article