నాట్స్ మేరీల్యాండ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఆర్ట్ వర్క్‌షాప్

🕑 Published: July 05, 2026 at 04:50 PM CST

సృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా నాట్స్ సంస్థ ఆన్‌లైన్ ఆర్ట్ వర్క్ షాప్ ఉచితంగా నిర్వహించింది. నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉచిత ఆన్‌లైన్ ఆర్ట్ వర్క్‌షాప్‌ కళాభిమానులను ఆకట్టుకుంది. చెన్నైకి చెందిన ప్రముఖ చిత్రకారుడు గోపీకృష్ణమూర్తి ఈ వర్క్‌షాప్‌లో చిత్రకళపై శిక్షణ ఇచ్చారు. కళారంగంలో 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, అనేక పురస్కారాలు అందుకున్న ఆయన పెన్సిల్ డ్రాయింగ్‌లోని మెళకువలను సులభంగా, దశలవారీగా వివరించారు. ఆయన బోధనాశైలి పట్ల శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కళాభిమానులు ఈ వర్క్‌షాప్‌లో భాగస్వాములయ్యారు. 5-13 సంవత్సరాల వయస్సు గల 30 మంది చిన్నారులు పెన్సిల్ డ్రాయింగ్‌లో ప్రాథమికాంశాలను ఉత్సాహంగా నేర్చుకున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ సభ్యులు వాకుల్ మోరే, విశ్వ మార్ని, హారిణి నర్ల, సువర్ణలు కీలకపాత్ర పోషించారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడలు మేరీల్యాండ్ ఛాప్టర్‌ను అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
తానా పాఠశాల ఆధ్వర్యంలో ప్రవాస తల్లిదండ్రుల సమావేశం"అచ్చ తెలుగు తిట్లు"పై తానా సాహిత్య సదస్సుతితిదేకు రూ.1.1కోట్ల విరాళంATA Womens Forum In 19th ATA Conventionడెన్వర్‌లో రుక్మిణీ కళ్యాణం నృత్యరూపకంకాన్సాస్ వరదల్లో పరుచూరు యువకుడి గల్లంతుజొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక సిరికోన 2025 నవలారచన పోటీల విజేతలుఅమెరికా టు ఛలో ఇండియా - పెరుగుతున్న ప్రవాస భారతీయుల తిరుగు ప్రయాణంఫిలడెల్ఫియాలో తానా "ఫాదర్స్ డే"..పాల్గొన్న హీరో సుమన్సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరంలండన్‌లో కామారెడ్డి యువకుడి మృతిపద్మ పురస్కారం అందుకున్న డా.నోరిసిన్సినాటీలో అలరించిన మోహినీ భస్మాసుర కూచిపూడి నృత్యనాటకంఅర్వింగ్ మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంచెన్నై కళాసుధ ఆధ్వర్యంలో గురుశ్రీ పురస్కార ప్రదానోత్సవంతానా-పాఠశాల ఆధ్వర్యంలో పితృదినోత్సవండెట్రాయిట్‌లో కోమటి జయరాంకు ఘన సన్మానంఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.కోటి విరాళంవర్జీనియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవంసిద్ధార్థ ఫార్మసీ కళాశాలతో సెయింట్ మార్టినస్ ఒప్పందం
Previous Article Next Article