ఉల్లాసంగా నెబ్రాస్కా తెలుగు సమితి వనభోజనాలు

🕑 Published: September 22, 2026 at 09:22 AM CST

తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా(TSN) ఆధ్వర్యంలో వనభోజనాలు ఉల్లాసంగా ఆత్మీయ వాతావరణంలో సాగాయి. గత శనివారం యూజీన్ టి. మహోనీ స్టేట్ పార్క్‌లో జరిగిన ఈ వనభోజనాలకు తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యాయి. చిన్నారులు, పెద్దల కోసం వివిధ ఆటలు, సరదా పోటీలు నిర్వహించారు. వనభోజనాల్లో రుచికరమైన వంటకాలు ఆకట్టుకున్నాయి. మహిళలకు గోరింటాకు, చిన్నారులకు ఫేస్ పెయింటింగ్ ఏర్పాటు చేశారు. సంగీతం, నృత్యాలు, ఆటలు, కబడ్డీ, చిన్నారుల కేరింతలతో రోజంతా కుటుంబాలంతా ఆనందంగా గడిపారు. కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

సమితి అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ మాట్లాడుతూ, వనభోజనాలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా తెలుగు కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించే సామాజిక వేదికగా నిలిచాయని పేర్కొన్నారు. సంస్థ ఉపాధ్యక్షుడు తాతారావు, మెంబర్‌షిప్ కమిటీ చైర్ బాల కామిరెడ్డి, కల్చరల్ చైర్ రమ్య, కో-చైర్ వినీల, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు మాధురి, కమిటీ సభ్యురాలు శ్వేత, సుందర్ చొక్కరా, అలగన్ చిన్నప్ప, పావులూరి సత్యనారాయణ, వెంకట్ మాదలి, వేణు మురకొండ, రమేష్ రాయపాటి, వెంకట్ స్వర్ణ, రాజేష్ చింతపల్లి, మధు, రాజు దాట్ల, నారాయణ, సాంబ దివ్వెల, అనూప్ మాణిక్యం, చైతన్య రవిపాటి, యుగంధర్ పంగా, అవినాష్ మదూరి, ఉమ అద్దుల, రాజా కోమటిరెడ్డి, అనిల్ పోతినేని, జయకృష్ణ నల్లా, వంశీ కంచెర్ల, లక్ష్మీ గోరంట్ల తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
బే-ఏరియాలో వీక్షణం సాహితీ సంస్థ 14వ వార్షికోత్సవంసెయింట్ లూయిస్‌లో నాట్స్ క్రీడా సంబరంన్యూజెర్సీలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలులండన్‌లో వైభవంగా వినాయక నిమజ్జనంజపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలుఅక్టోబరులో కొసరాజు రచనల ఆవిష్కరణGGH నాట్కో క్యాన్సర్ సెంటరులో అత్యాధునిక జన్యు పరీక్షలుప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్న గ్లోబల్ తెలంగాణ సంఘంసిరికోన సాహితీ అకాడమీ 2026 నవలల పోటీఫ్రిస్కోలో టాంటెక్స్ ఉచిత వైద్య శిబిరంశ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సింగపూర్ కళాకారుల ప్రదర్శనఉల్లాసంగా సాగిన తానా వేసవి చదరంగ పోటీఅమెరి"కలల"పై నాట్స్ అవగాహన సదస్సుఎడిసన్‌లో వైభవంగా వినాయక చవితి వేడుకలుSingapore: TCSS ఆధ్వర్యంలో వైభవంగా వినాయక చవితిATA NJ Hosts EcoFriendly Ganesha Idol Making EventAustralia: సిడ్నీలో "నిజం గెలిచింది"మెలిస్సాలో "సంకీర్తన" తరగతులువీలునామా ప్రాముఖ్యతపై తానా సదస్సుఏపీలో తెలుగు భాషాభివృద్ధికి సలహా కమిటీ
Previous Article Next Article