🕑 Published: October 08, 2026 at 11:39 AM CST
టెక్సాస్‌లోని అర్వింగ్‌లో ఉన్న అర్వింగ్ ఆర్ట్స్ సెంటర్, శంకర నేత్రాలయ యుఎస్ఎ ఆధ్వర్యంలో "మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్ 2026" కార్యక్రమం నిర్వహించారు. 300 మంది హాజరయ్యారు. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU)కు, గ్రామీణ భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యానికి నిధుల సేకరణలో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. డాలస్ విభాగ ఉపాధ్యక్షుడు చినసత్యం వీర్నపు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డాక్టర్ యు.నరసిమ్హారెడ్డిలు స్వాగతోపన్యాసం చేసి సంస్థ కార్యక్రమాలను వివరించారు. వ్యాఖ్యాతగా శిరీష కోటమరాజు కార్యక్రమాన్ని నడిపించారు. బాల రెడ్డి ఇందుర్తి అధ్యక్షుడిగా ఎనిమిదేళ్ల నాయకత్వంలో, శంకర నేత్రాలయ యూఎస్ఏ ఏడు నగరాల నుండి ముప్పై నగరాలకు విస్తరించింది.
సమన్విత మాడ అమెరికా, భారత జాతీయ గీతాలాపన అనంతరం సెంటర్ ఫర్ కూచిపూడి డాన్స్-టెక్సాస్, నాట్యోం డాన్స్ అకాడమీ, గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్, రాగలీన డాన్స్ అకాడమీ, తాండవం-స్కూల్ ఆఫ్ కూచిపూడి, రాగమయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ విద్యార్థుల నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా 2,000 కంటిశుక్ల శస్త్రచికిత్సలకు అవసరమైన నిధులు సమకూరాయి.
శంకర నేత్రాలయ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్ కార్యక్రమాన్ని రెండు నుండి అయిదుకు పెంచారు. మరో మూడు నిర్మాణంలో ఉన్నాయి. దాతలు ప్రకాష్ బెడపూడి, తిరుమల్ రెడ్డి కుంభం, శ్రీని వీరవెల్లి, సునీత & డాక్టర్ రాజు కోసూరి, అర్జున్ మదాడి, డాక్టర్ కృష్ణబాబు చుండూరి, జె.కె. రెడ్డి, FCA, భీమా పెంటా, సుధాకర్ గార్లంక, ప్రేమ్ కలిదిండికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీలక్ష్మి చక్రవర్తుల, ప్రతిష్టా భట్, అనిరుధ్ కొందురి, సాన్వి కె, విభా శ్రీవెన్, ఇషిర బుర్రా, మేఘన దారిమడుగు, నేహా దారిమడుగుల, మూర్తి రేకపల్లి, శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి, కార్తికేయ, దీనదయాళన్ తదితరులు సహకరించారు.





