'దిల్ రాజు డ్రీమ్స్' ప్రారంభం. తోడ్పడిన ఆటా.

Featured Image

వర్జీనియాలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్(DRD)' వేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్(ATA) సహకారం అందించింది.

నిర్మాత, రచయిత, దర్శకుడు, నటుడు, గాయకుడు, సినిమాటోగ్రాఫర్ లేదా సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే వారికి ఈ వేదిక సహకరిస్తుందని దిల్ రాజు తెలిపారు. వేదిక పనితీరు, ప్రణాళికలకు సంబంధించిన వివరాలను దిల్ రాజుతో పాటు ఆయన సతీమణి తేజస్విని వెల్లడించారు.

స్క్రిప్ట్‌లు, ప్రాజెక్ట్‌ ఐడియాలను తమకు ఈ వేదిక ద్వారా పంపవచ్చునని జ్యూరీ సభ్యుల ద్వారా ఎంపికైన ప్రాజెక్టులకు తాము మార్గనిర్దేశనం చేసి అవసరమైన మద్దతును అందిస్తామని తెలిపారు. DRDలోని AI టూల్స్ ద్వారా స్క్రిప్ట్‌లను త్వరగా తయారుచేయడం, విజువల్ ప్రివ్యూస్ తయారు చేయడం, షూటింగ్ ఖర్చు తగ్గించడం సాధ్యపడుతుందన్నారు. దర్శకులు కావాలనుకునే వారి కథను బట్టి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

తెలుగు సినిమా ఎన్నారై ఔత్సాహితులకోసం ఏర్పాటు చేసిన దిల్ రాజు డ్రీమ్స్ కార్యక్రమాన్ని ఆటా ద్వారా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అధ్యక్షుడు జయంత్ చల్లా పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రతిభావంతులైన ఎన్నారైలు ఈ వేదిక ద్వారా సినిమాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగలరనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ప్రవాసులతో పాటు ఆటా ప్రతినిధులు రామ్ మట్టపల్లి, విష్ణు మాధవరం, శ్రీధర్ బాణాల, మహేష్ కేసిరెడ్డి, జీనత్ కుందూరు, వేణు నక్షత్రం, అనిల్ బోయినపల్లి, రమేష్ భీంరెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags-ATA Helps Dilraju Launch Dil Raju Dreams DRD Platform in USA

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles