విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందిస్తున్న నాట్స్ కార్యక్రమాలు

Featured Image

డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) చేపట్టిన రెండు సేవా కార్యక్రమాలు సమాజాన్ని సేవ చేసే దిశగా యువతను ప్రోత్సహిస్తున్నాయి. 'అడాప్ట్ ఏ స్ట్రీట్' కార్యక్రమంలో భాగంగా ఫ్రిస్కో నగరంలోని ఫీల్డ్స్ పార్క్‌వే వద్ద వీధిని శుభ్రం చేసి దాదాపు 25 పౌండ్లకు పైగా చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా తెలుగు వారు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై యువతలో అవగాహన పెంచే ఉద్దేశ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రకృతి పట్ల ప్రేమను, బాధ్యతను కల్గించవచ్చని నాట్స్ పూర్వ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పిల్ల‌ల‌కు, దాత‌ల‌కు, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు ధన్యవాదాలు తెలిపారు.

'ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్' సంస్థతో కలిసి పేద పిల్లలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేకంగా ప్యాకింగ్ కార్యక్రమం నిర్వహించింది. రిచర్డ్‌సన్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 20 మంది తెలుగు యువతీ యువకులు 133 బాక్సుల్లో 28,728 భోజనాలను ప్యాక్ చేశారు. ఈ ప్యాకింగ్ ద్వారా 78 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పౌష్టికాహారం అందించే అవకాశం ఏర్పడింది. బాపు నూతి, రాజేంద్ర మాదలలు సమన్వయపరిచారు.

ఈ రెండు కార్యక్రమాలకు పావని నున్న, వంశీ వేనాటి, కిరణ్, సౌజన్య రావెళ్ల, సహాయ కోశాధికారి రవి తాండ్ర, మీడియా కోఆర్డినేటర్ కిషోర్ నారెలు సహకారం అందించారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.

Tags-NATS Telugu Dallas Imparting Social Awareness In Next Gen Kids

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles