ఫిలడెల్ఫియాలో గౌరు వెంకట్‌రెడ్డి పర్యటన

Featured Image

అమెరికా పర్యటనలో ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు గౌరు వెంకట్ రెడ్డి ఫిలడెల్ఫియాలో పర్యటించారు. స్థానిక ప్రవాసాంధ్రులు ఆయనను సత్కరించారు. చెస్టర్ స్ప్రింగ్స్ నగరంలోని ప్రవాసాంధ్రులతో సమావేశమైన గౌరు ఎన్నారైలను పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిలో సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పాణ్యం నియోజకవర్గాన్ని మెగా ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారని, ఎమ్మెల్యే గౌరు చరిత నాయకత్వంలో పాణ్యం నియోజకవర్గం హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. పొట్లూరి రవి, జగదీశ్ రెడ్డి అనుముల, ఫణి కంతేటి, మురళి రెడ్డి, బాలాజీ వీర్నాల, ప్రసాద్ కునారపు, హరి తుబాటి, రవి చిక్కాల, కోటి యాగంటి, సురేష్ యలమంచి, లక్ష్మినరసింహ రెడ్డి కొండా తదితరులు పాల్గొన్నారు.

Tags-Gouru Venkatreddy Tours Philadelphia

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles