బాలభారతి పాఠశాలకు ₹10లక్షల విరాళం

Featured Image

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని పొదుపులక్ష్మీ ఐక్యసంఘం నిర్వహిస్తున్న బాలభారతి పాఠశాలకు వరసగా ఆరవ సంవత్సరం ₹10 లక్షల విరాళాన్ని తానా బోర్డ్ సభ్యుడు రవి పొట్లూరి అందించారు.

శుక్రవారం నాడు బాలభారతి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు రేంజి డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా చెక్కును పాఠశాల వ్యవస్థాపకురాలు విజయభారతికి అందజేశారు. అనాధ విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యనందించాలనే లక్ష్యంతో ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు రవి తెలిపారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్న బాలభారతి పాఠశాలకు భవిష్యత్తులో కూడా తమవంతు సహకారం అందజేస్తామని, పలువురు ఎన్నారైలు ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్నట్లు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఓర్వకల్లు పొదుపు సంఘం మహిళలు శ్రమశక్తితో నిర్మించుకున్న బాలభారతి పాఠశాల మహిళాశక్తికి నిదర్శనమని, పొదుపుసంఘం మహిళలను అభినందిస్తున్నట్లు డిఐజి డాక్టర్ ప్రవీణ్ కోయా తెలిపారు. బాలభారతి పాఠశాల నుండి రాజ్య పురస్కారానికి అర్హత సాధించి గవర్నర్ నుండి ప్రశంసా పత్రం అందుకున్న విద్యార్థిని గీతను అభినందించి ఐదు వేల రూపాయల నగదు బహుమతి అందజేశారు. రవి కుటుంబ సభ్యులు, డిఎస్పీ బాబు ప్రసాద్, సిఐ చంద్రబాబు, ఎసై సునీల్, పొదుపులక్ష్మీ ఐక్యసంఘం కమిటీ కార్యవర్గం రత్నమ్మ, జుబేదా, సుమతి, సరస్వతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags-Ravi Potluri Donates 10Lakhs To Kurnool Balabharati School

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles