డీసీలో..గిడుగుకు GWTCS ఘన నివాళి

Featured Image

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తికి ఘన నివాళి అర్పించారు. ఉపాధ్యక్షుడు సుశాంత్ మన్నే, కార్యదర్శి భానుప్రకాష్ మాగులూరిలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచారు.

అధ్యక్షుడు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ గిడుగు వెంకట రామమూర్తి గ్రాంథిక భాషకు బదులుగా సాధారణ ప్రజలకు అర్థమయ్యే వ్యావహారిక భాషను వాడాలని జీవిత కాల ప్రచారం, పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావ్య చామర్తి, బోనాల రామకృష్ణ, బండి సత్తిబాబు, కోటి కర్నాటి, పునుగువారి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, మేకల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags-Tribute To Gidugu RamaMurthy In DC By GWTCS

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles