తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలుగుభాషా యువభేరి

Featured Image

తానా సాహిత్యవిభాగం-తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం నాడు గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగుభాషా యువభేరి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర గిడుగు చేసిన కృషిని సోదాహరణంగా వివరించి నివాళులర్పించారు.

ముఖ్య అతిథి, సినీగీత రచయిత తిపిర్నేని కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేసినప్పటికీ తన పూర్వీకుల ప్రోత్సాహం, గురువుల ప్రేరణ కారణంగా తెలుగు భాషామాధుర్యాన్ని చవిచూసే అవకాశం కలిగిందని, తెలుగు సినిమా రంగంలో దాదాపు వంద పాటలు వ్రాసే స్థాయికి తీసుకువెళ్లిందన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు.

విశిష్టఅతిథులుగా పాల్గొన్న

అద్దంకి వనీజ, 9వ తరగతి విద్యార్ధిని, విజయవాడ - ఘనమైన గద్యం;

అష్టావధాని వింజమూరి సంకీర్త్, 9వ తరగతి విద్యార్ధి, హైదరాబాద్ (వింజమూరు, నల్గొండ జిల్లా) - శతక సాహిత్యం;

బులుసు రమ్యశ్రీ, 10వ తరగతి విద్యార్ధిని (భీమడోలు, ఏలూరు జిల్లా) - ఆధునిక సాహిత్యం;

శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ, బి.ఏ విద్యార్ధి, తిరుపతి - ఉదాహరణ కావ్య వైభవం;

అష్టావధాని యెర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, పి.హెచ్.డి విద్యార్ధి, తిరుపతి (బల్లిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా) - అవధానంలో సామాజిక దృక్పథం;

అష్టావధాని డా.బోరెల్లి హర్ష, బి.డి.ఎస్, దంతవైద్యులు, కర్నూలు - వర్ణన;

అష్టావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్, ఎం.టెక్ విద్యార్ధి, ఐఐటి, ఖరగ్పూర్ (హైదరాబాద్) - నిషిద్ధాక్షరి;

అష్టావధాని గట్టెడి విశ్వంత్, పి.హెచ్.డి విద్యార్ధి, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (మెట్పల్లి, జగిత్యాల జిల్లా) - తెలుగుభాష పుట్టుపూర్వోత్తరాలు;

అష్టావధాని బాణావత్ నితిన్ నాయక్, బి.టెక్, ఐఐఐటి, బాసర (నిజామాబాద్) - అవధానవిద్య-ఒక సమీక్ష;

అష్టావధాని సుసర్ల సుధన్వ, ఎం.బి.బి.ఎస్ విద్యార్ధి, చెన్నై (హైదరాబాద్) – సమస్యాపూరణం అనే అంశాలపై ప్రసంగించారు.

Tags-TANA Prapancha Sahitya Vedika Telugu Bhasha Yuvabheri On Gidugu Jayanti

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles