ఆస్ట్రేలియాలో తెలుగు అష్టావధానం

Featured Image

ఆదివారం నాడు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జనరంజని రేడియో సంస్థ, శ్రీవేదగాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం నిర్వహించారు. తటవర్తి కళ్యాణ చక్రవర్తి అవధానిగా రక్తికట్టించారు. న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డు సాధించిన డా. తంగిరాల నాగలక్ష్మి సంచాలకురాలిగా నిర్వహించారు.

సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో అవధానం ఉత్కంఠగా సాగింది. కృష్ణ సుహాస్ తటవర్తి, ధ్రువ్ అకెళ్ళల ప్రశ్నలు ఆలోచింపజేశాయి. కృతిపద్యము అనే అంశంలో గాయత్రి నందిరాజు, తన్వి వంగలలు అలరించారు. శరణ్ తోట సాంకేతిక సహకారం అందించారు.

Tags-Telugu Ashtavadhanam In Melbourne Australia

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles