మిస్సోరిలో నాట్స్ క్రీడా పోటీలు

Featured Image

నాట్స్ మిస్సోరీ విభాగం ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు చెస్టర్‌ఫీల్డ్ సిటీ కౌన్సిల్ సభ్యుడు గ్యారీ చేతుల మీదుగా ప్రారంభించారు. 25 జట్లు, 200 మంది ఆటగాళ్లు తమ ప్రతిభ ప్రదర్శించారు.

నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రమేష్ బెల్లం, పూర్వ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, మిస్సోరీ చాప్టర్ కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర, సెయింట్ లూయిస్ తెలుగు సంఘ మాజీ అధ్యక్షుడు సురేంద్ర బాచిన, మధుసూదన్ దద్దాల, మురళి బందరుపల్లి, నాట్స్ మిస్సోరీ ఛాప్టర్ బృందం తరుణ్ దివి, చైతన్య పుచకాయల, సంకీర్త్ కట్కం, రాకేష్ రెడ్డి మారుపాటి, సునీల్ స్వర్ణ, హరీష్ గోగినేని, నరేష్ రాయంకుల, నవీన్ కొమ్మినేని, శ్రీనివాస్ సిస్ట్ల తదితరులు పోటీల నిర్వహణకు సహకరించారు. ఐదు విభాగాలలో విజేతలకు నాట్స్ ట్రోఫీలను పంపిణీ చేశారు. క్రీడాకారులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు శ్రీహరి మందాడిలు అభినందించారు.

Tags-Missouri NATS Volleyball Throwball Competitions 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles