హెన్రీ ఫోర్డ్ విశిష్ఠ పురస్కారం అందుకున్న డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరి

Featured Image

ప్రఖ్యాత పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్ 1915లో అమెరికాలోని డెట్రాయిట్‌లో ఆయన పేరు మీద వైద్య సేవలను "హెన్రీ ఫోర్డ్ హెల్త్" పేరిట ప్రారంభించారు. ఈ సంస్థలో ప్రస్తుతం 5000 మంది వైద్యులు పనిచేస్తున్నారు. 1950 నుండి అయిదేళ్లకు ఒకసారి ఈ ఆసుపత్రుల్లో అత్యుత్తమ సేవలు అందించిన వైద్యులను విశిష్ఠ సేవా పురస్కారాల ద్వారా గుర్తిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) డెట్రాయిట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 2025కు గానూ డా. వేములపల్లి రాఘవేంద్ర చౌదరిని హెన్రీ ఫోర్డ్ విశిష్ఠ సేవా పురస్కారంతో సత్కరించారు.

డా. వేములపల్లి పూర్వీకులది హనుమాన్ జంక్షన్ దగ్గర వేలేరు. మద్రాసు స్టాన్లీ మెడికల్ కళాశాల నుండి 1982లో ఎంబీబీఎస్ పట్టా అందుకున్నాక ఇంగ్లాండ్‌లో ఎఫ్ఆర్‌సీఎస్ చేశారు. 1995-98 మధ్య హెన్రీ ఫోర్డ్ ఆసుపత్రిలో రెసిడెన్సీ చేసిన ఆయన ఇదే ఆసుపత్రిలో పలు విభాగాల్లో పని చేసి ప్రశంసలు అందుకున్నారు. రాఘవేంద్ర చౌదరి ప్రస్తుతం ఫ్యామిలీ మెడిసిన్ సేవల విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో వందల మంది వైద్యులకు మార్గనిర్దేశం చేసినందుకు, హెన్రీ ఫోర్డ్ వైద్య వ్యవస్థ ఆశయాలు, లక్ష్యాలకు గొడుగు పట్టినందుకు ఆయనకు ఈ పురస్కారం అందజేశారు. డా. వేములపల్లికి ప్రవాసాంధ్రులు అభినందనలు తెలిపారు. ఈయన గౌరవార్థం అక్టోబర్ 23న డెట్రాయిట్‌లో సెయింట్ మార్టినస్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

డా. రాఘవేంద్ర చౌదరి కుమార్తె చర్మవ్యాధుల వైద్యురాలుగా, ఆయన కుమారుడు జీర్ణవ్యవస్థ వైద్య నిపుణుడిగా, అల్లుడు యూరాలజిస్టుగా వైద్య రంగంలోనే సెవలందిస్తున్నారు.

Tags-Detroit Dr Vemulapalli Raghavendra Chowdary Felicitated With Henry Ford Distinguished Career Award

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles