టెక్సాస్ గవర్నర్ నివాసంలో దీపావళి వేడుకలు. హాజరైన ప్రవాసాంధ్ర ప్రముఖులు.

Featured Image

టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అధికార నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత 11ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న ఈ సాంప్రదాయ వేడుకలకు ప్రవాస భారతీయులు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నిర్వహించిన వేడుకల్లో ప్రవాసాంధ్ర ప్రముఖులు పాల్గొని గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు జ్యోతులను వెలిగించి సంప్రదాయబద్ధంగా వేడుకలను ప్రారంభించారు. వివిధరంగాలలో విశేష కృషి చేస్తూ, టెక్సస్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

హ్యూస్టన్ భారత కాన్సులేట్ కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్, డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా తదితర నగరాలకు చెందిన ప్రవాసాంధ్రులైన డా. ప్రసాద్ తోటకూర, చినసత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ తదితరులు పాల్గొన్నారు.

Tags-Texas Governor Greg Abbott Celebrates Diwali With NRTs

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles