డల్లాస్ చేరుకున్న లోకేష్

Featured Image

ఏపీ విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చేస్తున్న తన అమెరికా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం డల్లాస్ చేరుకున్నారు. ఆయనకు ఎన్నారై తెదేపా శ్రేణులు, కూటమి అభిమానులు ఘన స్వాగతం పలికారు. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి) లోకేష్ డల్లాస్ పరిసర ప్రాంతమైన గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసినందుకు ప్రవాసాంధ్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపేందుకు ఈ వేదికను వినియోగించుకోనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేవారికి ఉచిత భోజనాన్ని, లోకేష్‌తో ఫోటో దిగే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఏపీ ఎగుమతులు-దిగుమతుల వాణిజ్యాన్ని బలోపేతం చేసే పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో లోకేష్ సోమ, మంగళవారాల్లో శాన్‌ఫ్రాన్సిస్కోలో పర్యటిస్తారు. లోకేష్ పర్యటన ఏర్పాట్లను ఏపీ ఎన్ఆర్‌టీ ఛైర్మన్ డా. వేమూరు రవికుమార్, ఎన్నారై తెదేపా సమన్వయకర్త కోమటి జయరాం, లోకేష్ నాయుడు కొణిదెల, రాజా పిల్లి, సతీష్ మండువ తదితరులు సమన్వయపరుస్తున్నారు. లోకేష్‌కు స్వాగతం పలికిన వారిలో రామ్ యలమంచిలి, మండువ సురేష్, నవీన్ యర్రమనేని, సుధీర్ చింతమనేని, సుగణ్ చాగర్లమూడి, సూరపనేని రాజా (సెయింట్ లూయిస్), గుదె పురుషోత్తం చౌదరి (నార్త్ కరోలినా), యాష్ బొద్దులూరి (వర్జీనియా), సాయి బొల్లినేని (నార్త్ కరోలినా), గొర్రెపాటి చందు (బోస్టన్), జిల్లెళ్లమూడి వెంకట్ (డల్లాస్), చండ్ర దిలీప్, జాస్తి శ్రీతేజ, సాయి మద్దిరాల తదితరులు ఉన్నారు.

Tags-AP IT Minister Nara Lokesh Reaches Dallas For Telugu Diaspora Meeting

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles