న్యూజెర్సీలో నాట్స్ ఫుడ్ డ్రైవ్ - ఉత్సాహంగా పాల్గొన్న యువత

Featured Image

నాట్స్ న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. వివిధ రకాల ఆహార పదార్ధాలను నాట్స్ సభ్యులు సేకరించి న్యూ బ్రన్స్విక్ లోని ఓజనం ఛారిటీ సెంటర్ నిర్వాహకులకు అందించారు. ఆకలితో ఉండే అభాగ్యుల కోసం లక్ష ఫుడ్ క్యాన్స్ సేకరించాలని నాట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దానిలో భాగంగానే అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. న్యూజెర్సీలో నాట్స్ సభ్యులు, నాయకులు ఈ ఆహార పదార్థాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలుగు విద్యార్ధులు తనీష్ అన్నం, దియా మందాడి, సూర్య టేకీ, జతిన్ మందడి, ప్రణవ్ గడ్డిపాటి, లోలిత్య కుంచె, వియాన్ వెనిగళ్ల, పర్ణిక తెల్ల, భవిన్ తెల్ల, శ్రీనిక నూతలపాటి, ప్రీతి గుత్తికొండ, శరణ్ మందడి తదితర ప్రవాస యువతీయువకులు ఇందులో భాగస్వామ్యులయ్యారు. నాట్స్ నిర్వహించే ఈ కార్యక్రమంలో విద్యార్ధులు పాల్గొనటం ద్వారా సమాజ సేవ చేసినందుకు గానూ కాలేజీ ప్రవేశాల్లో ప్రత్యేక వెసులుబాటు దొరుకుతుంది. నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, ప్రసాద్ టేకీ, రమేష్ నూతలపాటి, చంద్రశేఖర్ కొణిదెల, వంశీ వెనిగళ్ల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, మల్లి తెల్ల, ఈశ్వర్ అన్నం, శ్రీనివాస్ కొల్లా, ప్రభాకర్ మూల, సత్య కుంచె తదితరులు పాల్గొన్నారు.

Tags-NATS Food Drive In New Jersey

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles