యూకె ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన

Featured Image

బిబిసి (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువెంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకె నలుమూలనుండి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రోస్టేట్ కాన్సర్ అవగాహనా సదస్సులో పాల్గొన్నారు. పురుషుల్లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన కల్పించి, దాన్ని ఎదుర్కొనే పద్ధతులపై సూచనలు చేశారు.

ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన కల్పించేందుకు విరాళాలు సేకరించారు. రూ.85వేలు లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ప్రోస్టేట్ కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి, రెండు తెలుగు రాష్ట్రాలలో, యుకెలో ఆర్థిక చేయూతను ఇస్తానని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags-Berkshire Boys Community BBC Meet on Prostate Cancer

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles